లోయలో పడిన టెంపో.. నలుగురు మృతి

లోయలో పడిన టెంపో.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్ కుల్లు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 22 మంది టూరిస్టులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 14 మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.