చెరువులలో ఆక్రమణలు తొలగించండి: ఇంఛార్జి కలెక్టర్

KRNL: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, గుడిసెలు వంటి తాత్కాలిక ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఇంఛార్జి కలెక్టర్ డా.బి. నవ్య ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటి వనరుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.