66 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేత

NLG: మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 18 గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ దోటి నారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు పాల్గొన్నారు.