బార్‌లో చోరీ చేసిన నిందితుడి అరెస్ట్
జనగామ పట్టణంలోని ఓ బార్‌లో దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి బార్ వెనుక ద్వారం పగలగొట్టి మద్యం బాటిళ్లు, నగదు అపహరించినట్లు కేసు నమోదు అయింది. పోలీసుల దర్యాప్తు అనంతరం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.