కల్వర్టులో ఇరుక్కున్న టిప్పర్

వికారాబాద్: వికారాబాద్ నుంచి నాగారం, తరిగొప్పుల, ద్యాచారం వెళ్లే దారిలో గోధుమగూడ సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టులో ఒక టిప్పర్ ఇరుక్కుపోయింది. దీనితో అటుగా బస్సులు, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.