దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ

NDL: శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు, స్థానికుల ఆరోగ్య సద్భావనలో భాగంగా దేవస్థానం ఉచిత యోగా శిక్షణను నిర్వహిస్తోంది. ప్రతి మంగళవారం, బుధవారం చంద్రవతి కల్యాణ మండపంలో శిక్షణ జరుగుతోంది. యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ శిక్షణ జరుగుతుండగా, ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యోగా జీవనశైలిని మెరుగుపరుస్తుందని తెలిపారు.