'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగాంతం చేయాలి'
పెద్దపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంజూరు చేసిన ఇళ్లలో 100 శాతం గ్రౌండింగ్ చేసి, నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, 800పైగా ఇళ్లు ఇంకా మార్కింగ్ కాలేదని తెలిపారు.