బంగారం విక్రయదారులకు ప్రభుత్వం షాక్
బంగారం విక్రయదారులకు చైనా షాక్ ఇచ్చింది. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజీ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి విక్రయించే సమయంలో వర్తించే వ్యాట్‌పై ఉన్న మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలు చేసిన బంగారాన్ని అలాగే విక్రయించినా లేక ప్రాసెస్ చేసిన తర్వాత విక్రయించినా పన్ను వర్తిస్తుందని చెప్పింది. ఈ రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.