NCERT వివాదం.. ముగ్గురిపై సుప్రీం చర్యలు
NCERT ఎనిమిదో తరగతి పుస్తకం వివాదంలో ముగ్గురు అధికారులపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. ఆ ముగ్గురిని విధులకు దూరంగా ఉంచాలని కేంద్రాన్ని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాధనంతో చేపట్టే ఏ పనినీ వారికి అప్పగించరాదని సూచించింది. న్యాయవ్యవస్థలో అవినీతిపై రాసిన వివాదాస్పద పాఠాన్ని ప్రచురించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.