ఒంగోలులో కాల్ సెంటర్ ఏర్పాటు
ప్రకాశం: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం కమిషనర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. తమ కార్యాలయంలో 08592-227766 నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.