VIDE: పొంగుతున్న వంగదాల్ వాగు

VIDE: పొంగుతున్న వంగదాల్ వాగు

SRD: సిర్గాపూర్ మండలం వంగదాల్ వాగు పొంగి పరవళ్లు తొక్కుతోంది. గురువారం భారీ వర్షం కురిసినందున ఎగువ నుంచి వరద జలాలు పొంగి పొర్లాయి. దీంతో వంగదాల్ , గైరాన్ తండాల మధ్య దాదాపు రెండు గంటలు రాకపోకలు నిలిచాయి. అనంతరం వాగు అవతల ఉన్న కొందరు స్థానికులు వాగును దాటించారు. అదేవిధంగా రాత్రి సైతం వర్షం కురవడంతో వరద ఉధృతి తీవ్రమైందని స్థానికులు నేడు తెలిపారు.