CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పట్టణ, మండల పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చెక్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని బాధితులకు సూచించారు.