సింగరాయి ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ
VZM: వేపాడ మండలం సింగరాయి ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ పి. బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేయాలని కోరారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు.