అన్నదానంలో పాల్గొన్న మున్సిపల్ ఇంఛార్జ్

KDP: పులివెందులలోని ZPTC బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని శనివారం పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్ వై.యస్. మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.