పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నాం: కలెక్టర్

KRNL: జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ - 2024కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నరు.