'అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి'
KMR: డిసెంబర్ 6న డా. బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతిని ప్రతి గ్రామంలో, మండలాలలో, డివిజన్ పరిధిలో, జిల్లా స్థాయిలలో నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు మైసయ్య శుక్రవారం కోరారు. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మన్నె చిన్న సాయిలు, గైని రవి పాల్గొన్నారు.