VIDEO: సాంప్రదాయంగా పిడితాడు లాగుడు పోటీ
MDK: తూప్రాన్ పట్టణంలో హోలీ పండుగ పురస్కరించుకుని బుధవారం రాత్రి పిడితాడు లాగే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని జెండా వద్ద దొంతి సంస్థానం.. వడ్డేపల్లి సంస్థానం మధ్య పీడీ తాడు లాగే కార్యక్రమం నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం తాడును ఆడపడుచుగా భావించే వడ్డేపల్లి సంస్థానానికి గెలుపొందినట్లుగా వదిలివేశారు. జెండా వద్ద జాతర ఉత్సవం ఘనంగా నిర్వహించారు.