రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

W.G: ఆకివీడు మండలం తాళ్ళకోడుకు చెందిన శ్రీను, తన కుమార్తెతో కలిసి మంగళవారం భీమవరం నుంచి తిరిగి వస్తుండగా, కలిసిపూడి గ్రామంలో ఎదురుగా వచ్చిన కారు వీరిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా, అతని కుమార్తెతోపాటు కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.