ఫైల్స్ దహనం.. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్

ఫైల్స్ దహనం.. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్

AP: తిరుపతి జిల్లా మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ మునితుకారాం, ప్రధాన అనుచరుడు వి.మాధవరెడ్డిని CID పోలీసులు అరెస్టు చేశారు. నాయకులతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన ఇరువురిని చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. వారిని తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. కాగా, ఈ కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.