మెప్మా ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మెప్మా ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) శుక్రవారం కార్యాలయ ఆవరణలో ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.