పరిగిలో ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే?
VKB: పరిగిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ ఏరియాలో భారీ ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి నోటీసులు లేకుండా భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై కొల్లాపూర్, రాపోలు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన తెలపగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. రైతులు వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.