ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ గెలవాలని ప్రత్యేక పూజలు
ATP: మహిళల ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఘన విజయం సాధించాలని కోరుతూ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురంలోని స్థానిక శివాలయంలో తెలుగు మహిళలతో కలిసి ఆమె పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఈ ఫైనల్‌లో మహిళా జట్టు కప్పు గెలిచి దేశానికి కీర్తి తేవాలని వారు ఆకాంక్షించారు.