26న కోనసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

26న కోనసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: కోనసీమ జిల్లాలో ఈనెల 26న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ముందుగా కేశనపల్లిలో కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత నష్టపోయిన 15 గ్రామాల కొబ్బరి తోటల రైతులను పరామర్శిస్తారు. అదేవిధంగా పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొంటారని, పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.