ఉగాది వేడుకలకు హాజరుకానున్న సీఎం
AP: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పండితులు నిర్వహించే పంచాంగ శ్రవణంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొననున్నారు.