రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సంబంధిత శాఖలు అందరూ సమిష్టిగా కృషి చేసి రహదారి ప్రమాదాలు తగ్గించాలన్నారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని సూచించారు.