ఆరూరి రమేష్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

JN: స్టేషన్ ఘనాపూర్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. తల్లి వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి ఆత్మీయ పలకరింపు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ ఎర్రబెట్టి ప్రదీప్ రావు పాల్గొన్నారు.