నోబెల్ శాంతి ప్రదానోత్సవానికి మరియా గైర్హాజరు
నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన మరియా మచాడోకు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నార్వే రాజధాని ఓస్లోలో ఇవాళ నిర్వహించారు. మరియా దేశం విడిచి వెళ్తే పరారీలో ఉన్న నేరస్తురాలిగా పరిగణిస్తామని వెనుజులా ప్రకటించింది. దీంతో ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ప్రోగ్రామ్‌ను రద్దు చేశారు. మరియా తరఫున ఆమె కుమార్తె ఈ అవార్డును అందుకోనుంది.