అగ్నిప్రమాదంపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు
SKLM: సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు వంశధార కాలువ వద్ద ఉన్న ధూపాన భాస్కరరావు మైక్ సెట్ అండ్ లైటింగ్ షెడ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల అస్తి నష్టం సంభవించింది. ఈ విషయమై ఆదివారం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మౌళి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇప్పిలి చిరంజీవిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన నష్ట వివరాలను యజమాని నుంచి సేకరించారు.