'పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏడాది రైతుకు పెట్టుబడి సాయం'

KRNL: పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది రూ.6 వేలు పెట్టుబడి సాయం అందజేయడం జరుగుతుందని బీజేపీ మంత్రాలయం నియోజకవర్గ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు.