VIDEO: తప్పుడు ప్రచారం నమ్మొద్దు: ఎమ్మెల్యే
WNP: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు తన మాటలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఆ ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్‌లోనే పేదలకు సంక్షేమం, పల్లెలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.