బీజేపీ జాతీయ అధ్యక్షుడితో మాజీ ఎంపీ భేటీ
SRD: జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం న్యూ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ వ్యవహారాలపై బీబీ పాటిల్ అధ్యక్షుడికి వివరించారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఆయన తెలిపినట్లు పాటిల్ చెప్పారు.