VIDEO: 'అమరావతి అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు'
VSP: అమరావతిని ఎప్పుడూ తాము వ్యతిరేకించలేదని మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి శనివారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి ‘MAVIGUN’ కాన్సెప్ట్‌లో భాగమని, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతి కూడా మావిగన్‌లో భాగమేనన్నారు.