ఈ మండలాల ప్రజలు జాగ్రత్త!

NTR: జిల్లాలో ఇవాళ 8మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ 40.5, రూరల్ 40.4, వీరుల్లపాడు 40.8, నందిగామ 40.9, జి.కొండూరు 40.4, చందర్లపాడు 41, ఇబ్రహీంపట్నం 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నట్లు తెలిపారు.