పాక్ దళారీ దేశం: జైశంకర్
అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యానించడంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. పాక్ చేస్తున్న ప్రయత్నాల్లో కొత్తేమీ లేదన్నారు. 1981 నుంచి ఆ దేశాన్ని అమెరికా ఉపయోగించుకుంటోందని చెప్పారు. పాక్ దళారీ దేశమని.. ఆ దేశంలాగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం చేశారు.