రామప్పలో విదేశీయుల సందడి
MLG: రామప్ప దేవాలయాన్ని గురువారం జర్మనీ, యూకే దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. రామప్ప శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం రామప్ప శిల్ప సంపదను ఆలయ గైడ్ విజయ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. రామప్ప సరస్సులో బోట్ షికారు చేస్తూ ఉల్లాసంగా గడిపారు.