నేడు కనిగిరిలో విద్యుత్‌కు అంతరాయం
ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఈ రోజు విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నట్లు విద్యుత్ AE శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కందుకూరు రోడ్డు చెప్పుల బజార్, నక్కలతిప్ప, గార్లపేట రోడ్డు రామయ్య నాయుడు హాస్పిటల్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.