తీవ్ర ఎండలో రేషన్ పంపిణీ.. ప్రజలకు తిప్పలు

తీవ్ర ఎండలో రేషన్ పంపిణీ.. ప్రజలకు తిప్పలు

JN: ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం సరఫరా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఉదయం 11 గంటల తరువాత ఎండ తీవ్రత ఎక్కవగా ఉండడంతో క్యూలైన్‌లో నిలబడలేక వెనుతిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సరఫరా కేంద్రాలల్లో బియ్యం పంపిణీ చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.