సమస్యలపై ఎమ్మెల్యేను ఆశ్రయించిన స్థానికులు

సమస్యలపై ఎమ్మెల్యేను ఆశ్రయించిన స్థానికులు

KRNL: కల్లూరు అర్బన్ 33వ వార్డు పరిధిలోని హంద్రీనది పరివాహక ప్రాంతంలో గృహాలకు ఇరిగేషన్ శాఖ, మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసుల నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానికులు పాణ్యం MLA గౌరు చరితా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సమస్యను వివరించిన స్థానికులకు MLA స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.