VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వైస్ ఛైర్మన్
WGL: రాయపర్తి మండలం బాలునాయక్ తండ, జగనాధపల్లి పలు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.