ప్రత్యేక సమగ్ర సవరణ కన్వీనర్‌గా దండు
ప్రకాశం: బీజేపీ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకాశం జిల్లా కన్వీనర్‌గా ఒంగోలుకు చెందిన దండు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. అర్హులైన ప్రతి ఓటర్‌ను జాబితాలో చేర్చడం, నకిలీ, అక్రమ ఓటర్లను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.