VIDEO: పైపు లీకేజీతో నీటి సరఫరాకు అంతరాయం
MDK: మరికల్ సమీపంలో మిషన్ భగీరథ పైపు లీకేజీలతో దామరగిద్ద మండలానికి మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచింది. వేసవి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తోంది. లీకేజీ మరమ్మతులు శుక్రవారం పూర్తిచేసి శనివారం నుంచి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని భగీరథ అధికారులు తెలిపారు.