పశువులకు గాలికుంటు నివారణ ఉచిత టీకాలు
KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడులో పశు వైద్యశాల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆమె సూచించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.