లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రికి రూ.2.75 లక్షల విరాళం
విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఆచార్య డి. భారతి బుధవారం లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్‌ను సందర్శించి, వైద్య సేవలను కొనియాడుతూ రూ. 2,75,000ల విరాళం అందజేశారు. ఈ విరాళం కార్డియాలజీ, ఇతర వైద్య విభాగాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు. మేనేజింగ్ ట్రస్టీ లయన్ ఆచార్య వెలగపూడి ఉమా మహేశ్వరరావు చెక్కు స్వీకరించారు.