కల్తీ పన్నీర్ తయారీ ముఠా గుట్టు రట్టు

కల్తీ పన్నీర్ తయారీ ముఠా గుట్టు రట్టు

దేశ రాజధాని ఢిల్లీలో కల్తీ పన్నీర్ తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. కెమికల్స్, రిఫైండ్ ఆయిల్‌తో ఈ కల్తీ పన్నీర్ తయారు చేసి నగరంలోని అనేక హోటల్స్, దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అధికారులు దాడులు చేయడంతో ఈ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్ల నుంచి ఈ కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నట్లు ముఠా సభ్యులు ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.