పోలీసులకు వరంగల్ సీపీ ఆదేశాలు

పోలీసులకు వరంగల్ సీపీ ఆదేశాలు

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూగజీవాల అక్రమ రవాణ జరగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలను తనిఖీ చేయకుండా పంపొద్దని సీపీ పేర్కొన్నారు.