MBNR: కోయిల్ సాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌కు భారీ వరద పెరగడంతో అధికారులు ఈరోజు 2 గేట్లను ఎత్తి 1,400 క్యూసెక్కుల నీటిని దిగువ ఊక చెట్టు వాగులోకి విడుదల చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 32 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 31 అడుగులుగా ఉంది. ఊక చెట్టు వాగు పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.