జీపీ కార్యదర్శికి అండగా నిలిచిన గ్రామస్థులు..!
BDK: దుమ్ముగూడెం మండలం కొత్తదంతెనం జీపీ కార్యదర్శి బీ.మాధవి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుండడంతో గ్రామ యువత విరాళాలు సేకరించారు. గ్రామస్థుల నుంచి రూ.41,200, ఇంఛార్జి కార్యదర్శి సాయి కృష్ణ రూ.9,000 అందించగా మొత్తం రూ.50,200ను మాజీ ZPTC అన్నే సత్యనారాయణమూర్తి, సర్పంచ్ పీ.సుబ్బారావు, ఉపసర్పంచ్ అనిత తదితరులు MPDOకు అందజేశారు.