'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం'
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఆదివారం వైసీపీ ఇంఛార్జ్ వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలు వైద్యం కోల్పోతారని చెప్పారు. ఈ మేరకు కోటి సంతకాలు గవర్నర్‌కి అందించి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. అనంతరం దీనికి ప్రజల ఏకత అవసరమని పిలుపునిచ్చారు.