VIDEO: అడ్మిషన్ల బాట పట్టిన అధ్యాపకులు
AKP: నర్సీపట్నం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకులు గురువారం నూతన అడ్మిషన్ల బాట పట్టారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తమ కళాశాలలో చేరాలని ఆహ్వానించారు. కళాశాల సాధించిన ప్రగతిని విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించామని పేర్కొన్నారు.