దేవరపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ

E.G: దేవరపల్లి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ దుర్గారావు ఆదివారం సూచించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.